
పిల్లలు..‘యోగా’ విద్యలో పిడుగులు
● రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ
సిరిసిల్లకల్చరల్: ప్రపంచానికి సనాతన భారతదేశం అందించిన అపురూప విద్య యోగాభ్యాసం. మనసును, శరీరాన్ని ఏకం చేసిన ఈ విద్యా విధానం ఇప్పుడు ప్రపంచదేశాల ప్రజలను ఏకం చేసింది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణ చేస్తూ దేహదారుఢ్యాన్ని అందించే యోగా విద్యను ప్రస్తుతం పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా సాధన చేస్తూ తమ ప్రతిభను పలు వేదికలపై చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. వారిలో కొందరి సంక్షిప్త పరిచయం..
ఐదు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రెండు బంగారు, రెండు రజత పతకాలు సాధించింది. పంజాబ్, హర్యానాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొనడం తనకు ఎక్కడాలేని ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించింది అని చెప్తోంది. యోగాపై ఏర్పడిన ఆసక్తితో తిరుపతిలో బీఎస్సీ యోగా సైన్స్ అధ్యయనం చేస్తోంది. నుదుటిపై దీపం ధరించి యోగాసనాలు వేయగలిగిన దేశంలోని ముగ్గురిలో ఒకరు సృజన. దీంతో రాష్ట్ర స్థాయిలో మంచి ఖ్యాతి దక్కించుకుంది. యోగా సాధనతో ఏర్పడిన శరీర దారుఢ్యంతో సైన్యంలో చేరాలనేది తన దీర్ఘకాల కోరిక.
అస్సాం, మహారాష్ట్రలో జరిగిన రెండు జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొన్నాడు. బంగారు పతకం సాధించి అప్పటి కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్‌చే ప్రత్యేకంగా సత్కరించబడ్డాడు. మారుమూల పల్లెటూరి నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించడంతో సొంతూరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వ్యవసాయ విద్యను అధ్యయనం చేసి సాగులో తన ఊరి రైతులకు ఉపయోగపడాలనుకుంటున్నాడు. అలాగే యోగాను విస్తృతం చేసి అందరి ఆరోగ్యం మెరుగుపడడంలో తన పాత్ర పోషిస్తానంటున్నాడు.
సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పదో తరగతి చదువుతున్న స్వర్గం విష్ణుప్రసాద్ మూడో తరగతి నుంచే యోగా సాధనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇప్పటికీ జిల్లా స్థాయిలో 20 చోట్ల పాల్గొని 18 విజయాలు అందుకున్నాడు. రాష్ట్ర స్థాయిలో మరో 20 సార్లు పోటీ పడి 8 సార్లు విజయాలు సొంతం చేసుకున్నాడు. అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రశంసలు అందుకున్నాడు. పంజాబ్, రాజస్థాన్‌లో జరిగిన పోటీల్లో నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నాడు.
వెల్దండి సృజన బీఎస్సీ యోగా
స్వర్గం విష్ణుప్రసాద్
పసుల ప్రణయ్, బస్వాపూర్

పిల్లలు..‘యోగా’ విద్యలో పిడుగులు

పిల్లలు..‘యోగా’ విద్యలో పిడుగులు