
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
చొప్పదండి: ఈ నెల 25 నుంచి ఉత్తరాంచల్‌లోని హరిద్వార్‌లో జరుగనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థిని ఏ.సౌమ్య ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ కొమురోజు కృష్ణ తెలిపారు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున 42కేజీల వ్యక్తిగత కేటగిరీలో పాల్గొని ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించగా జాతీయస్థాయికి ఎంపికై ందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్యుల రాజిరెడ్డి, జిల్లా తైక్వాండో అసోషియేషన్ కార్యదర్శి శ్రీగాధ సంతోష్ అభినందించారు.
ఉచిత శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్: ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ బంజారాహిల్స్ హైదరాబాద్‌లో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ (సీఎస్‌ఏటీ–2025–26)కు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వ కృషి అభినందనీయం
కొత్తపల్లి(కరీంనగర్): వి ద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి హర్షనీయమని అల్ఫో ర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల, శాతవాహన విశ్వవిద్యాలయంలో లా కోర్సును ప్రవేశపెట్టినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, అందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కట్టుబడటం అభినంనీయమన్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక