కలెక్టర్ సాక్షిగా కరెంట్ కట్
కరీంనగర్‌రూరల్: దుర్శేడ్ రైతువేదికలో మంగళవారం జరిగిన రైతు భరోసా సంబురాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా గాలివాన రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కాన్ఫరెన్స్‌కు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే ఇన్వర్టర్ సాయంతో వీడియో కాన్ఫరెన్స్‌ను కొనసాగించినప్పటికి ఫ్లాన్లు తిరగకపోవడం, లైట్లు వెలగకపోవడంతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఇబ్బందులకు గురయ్యారు. అప్రమత్తమైన ఎస్‌ఈ రమేశ్‌బాబు, డీఈ రాజం, ఏడీఈ రఘు, ఏఈ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది దుర్శేడ్ సబ్‌స్టేషన్‌లో 130 కేవీలైన్‌లో ఏర్పడిన సాంకేతికలోపాన్ని గుర్తించి సమస్యను పరిష్కరించారు. దుర్శేడ్, గోపాల్‌పూర్, గుంటూరుపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి రైతువేదికకు పునరుద్ధరించారు. అనంతరం సీఎం ప్రసంగాన్ని కలెక్టర్ పమేలా సత్పతితోపాటు డీఏవో భాగ్యలక్ష్మి, ఏడీఏ రణధీర్, ఎఈవో పైడితల్లి, దుర్శేడ్ సింగిల్‌విండో చైర్మన్ తోట తిరుపతి, మాజీ ఉపసర్పంచు సుంకిశాల సంపత్‌రావు, రైతులు వీక్షించారు.
సాంకేతిక సమస్య..
శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం రైతు వేదికలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన రైతు భరోసా వేడుకలు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం వీక్షణకు సాంకేతిక సమస్య ఏర్పడింది. కార్యక్రమం జరుగుండగా కొంతసేపు టీవీస్క్రీన్ పని చేయలేదు. ఏఈవోలు మరో టీవీ ఏర్పాటు చేశారు. అయితే అవగాహన లోపంతో రైతులెవరూ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఖాళీకుర్చీలు దర్శనం ఇచ్చాయి. తహసీల్దార్ సురేఖ, ట్రాన్స్‌కో ఏఈ సంపత్‌రెడ్డి, ఇద్దరు ఏఈవోలు, కాంగ్రెస్ నాయకుడు బండారి తిరుపతి, బీఆర్‌ఎస్ నాయకులు గొడిశాల తిరుపతి, పార్థసారథి, మరో నలుగురు కార్యక్రమాన్ని తిలకించారు.
● దుర్శేడ్ రైతు వేదికలో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు అంతరాయం


