
‘అల్ఫోర్స్’ విద్యార్థులకు అభినందన
కరీంనగర్: ఈఏపీసెట్– 2025 ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో సత్తా చాటిన ‘అల్ఫోర్స్’ విద్యార్థులను ఆ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్‌రెడ్డి ఆదివారం అభినందించారు.
‘ట్రినిటి’ విజయభేరి
కరీంనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు 405, 430, 560, 697, 730, 760, 791, 859, 934,1104, 1166, 1546, 1619, 1795, 1950తో పాటు మొత్తం 89మందికి పైగా విద్యార్థులు 10వేలలోపు ర్యాంకులు సాధించారు. విద్యార్థులను విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి, చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి అభినందించారు. ట్రినిటి జూనియర్ కళాశాలలు విద్యా రంగంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయని తెలిపారు. పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించారని ప్రశంసించారు.
‘శ్రీ చైతన్య’ ర్యాంకుల ప్రభంజనం
కరీంనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. గోకులకొండ వైష్ణవి 810, బి.మనోఘ్న 968, బి.సాత్విక్ 1,142, పి.స్ఫూర్తిశ్రీ 1,527, బి.శ్రావణి 1,803, పి.బ్లెస్సీ సుసన్ 2,106, పి.చందన 2165, పి.భరత్‌రెడ్డి 2,815, పి.అజితేష్ 3,016, కె. అనూహ్య 3,503, వి. ప్రవీణ్ 3,623, డి.రిషి 3,996, జి.అర్చన 4,171, ఆర్.శ్రీయాన్ 4,246, వి.శివాణి 4,570, బి.స్రవంతి 4,957, 5000 లోపు 16 ర్యాంకులు, 10000 ర్యాంకుల లోపు 51 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి, అధ్యాపకులు అభినందించారు. కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్ మోహన్‌రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఏజీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.

‘అల్ఫోర్స్’ విద్యార్థులకు అభినందన