
విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
● పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ గౌస్‌ఆలం సూచించారు. శనివా రం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో టౌన్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్ లాంటి రద్దీ ప్రదేశాల్లో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు పెంచాలని ఆదేశించారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులను విచారించి వారి వేలిముద్రలు సేకరించాలని తెలిపారు. తనిఖీల్లో పొర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్‌లను వినియోగించాలన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, సోషల్ మీడియాపై నిఘా ఉంచడం అవసరమని స్పష్టం చేశారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు బిల్లా కోటేశ్వర్, సృజన్‌రెడ్డి, జాన్‌రెడ్డి, శ్రీలత పాల్గొన్నారు.