
తల్లి త్యాగం.. నిలిచిన ప్రాణం..
ముస్తాబాద్(సిరిసిల్ల): తన జీవితం ఉన్నంత కాలం పేగు తెంచుకుని పుట్టిన సంతానం కోసం ఎంతటి త్యాగానికై న సిద్ధపడుతుంది అమ్మ. అందుకు నిలువెత్తు సాక్ష్యమే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన అరుట్ల భాగ్యమ్మ. అరుట్ల రాజిరెడ్డి– భాగ్యమ్మ దంపతుల కుమారుడు అరుట్ల మహేశ్‌రెడ్డి వంశపారపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో అస్వస్థతకు గురయ్యాడు. రెండేళ్ల క్రితం ఆస్పత్రిలో చేరగా రెండు కిడ్నీలు చెడిపోయాయి. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేస్తేనే ప్రాణపాయం నుంచి బయటపడుతాడని వైద్యులు తెలిపారు. మరో ఆలోచన లేకుండా తల్లి భాగ్యమ్మ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు 15నెలల క్రితం సర్జరీ చేసి భాగ్యమ్మ ఒక కిడ్నీని మహేశ్‌రెడ్డి వేశారు. అప్పుడు భాగ్యమ్మ కొడుకును కాపాడుకునేందుకు చేసి న త్యాగంతో ఇప్పుడు మహేశ్‌రెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. అమ్మ తనకు మరోసారి పునర్జన్మనిచ్చిందని, ఆమె త్యాగం వెలకట్టలేనిదని మహేశ్‌రెడ్డి అంటున్నారు.
– మరిన్ని కథనాలు 10లోu
తెలియదు
అవును
12
48
పేరెంట్స్‌ను
పట్టించుకోకుంటే కఠిన చర్యలు అవసరమేనా?
40
వద్దు

తల్లి త్యాగం.. నిలిచిన ప్రాణం..

తల్లి త్యాగం.. నిలిచిన ప్రాణం..