
తనను మరిచి.. పిల్లల్ని ముందుకు నడిపించి..
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామానికి చెందిన కల్లెం శంభా రెడ్డి–లక్ష్మి దంపతులకు కూతురు అంజవ్వ, ఇద్దరు కుమారులు మధుకర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి. పిల్లలు చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. దీంతో కుటుంబ భారం మొత్తం తల్లిపై పడింది. చిన్నపాటి వ్యవసాయమే ఒక్కటే ఆధారం. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించింది. ఎలాంటి ట్యూషన్ లేకుండా కుమారులు ఉన్నత చదువులు చదివారు. కూతురుకు వివాహం చేయగా వ్యవసాయంలో స్థిరపడింది. పుట్టింటికి చేదోడు వాదోడుగా నిలిచి ఇల్లు కట్టించింది. మధుకర్‌రెడ్డి జగిత్యాల జిల్లాలో మండల ప్రణాళిక అండ్ గణాంకాధికారిగా, జీవన్‌రెడ్డి పెద్దపల్లి జిల్లాలో ప్రణాళిక అండ్ గణాంకాధికారిగా ఉద్యోగం సాధించారు. ఇద్దరికీ పెళ్లిల్లు అయ్యాయి. మధుకర్‌రెడ్డి మేనమామ కుతూరు మౌనికను వివాహం చేసుకోగా హౌజ్‌వైఫ్. జీవన్‌రెడ్డి భార్య ప్రియంకా మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్. లక్ష్మి ఆత్మస్థైర్యంతో కష్టపడి ముగ్గురిని ఉన్నత స్థితికి తీసుకొచ్చింది. తనను మరిచి తమను ముందుకు నడిపించిన అమ్మ లేకుంటే ఈ స్థితికి రాలేకపోతుమని కొడుకులిద్దరూ చెప్పుకొచ్చారు.