
కదం తొక్కిన జర్నలిస్టులు
గోదావరిఖని: సాక్షి ఎడిటర్ ధనంజయ్‌రెడ్డి నివాసంపై ఏపీ పోలీసుల దాడిని నిరసిస్తూ పాత్రికేయులు స్థానిక బస్టాండ్ వద్ద గురువారం రాస్తారోకో నిర్వహించారు. సాక్షి ఉమ్మడి జిల్లా బ్యూరో భాషబోయిన అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ‘సాక్షి’ యాజమాన్యంపై కక్ష సాధిస్తోందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. రాస్తారోకోలో జర్నలిస్టులు గుడ్ల శ్రీనివాస్, కాల్వ చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కూరి శ్రీనివాస్, కీర్తి రమేశ్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.