
బ్రహ్మోత్సవాలకు రండి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని, ఉత్సవాలకు రావాలని ఆలయ ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వాన పత్రిక అందించారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాజీ హౌస్‌ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, హుస్నాబాద్ వ్య వసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శంకరయ్య, ఈవో రాజ్‌కుమార్, క్లర్క్ కవిత, పూజా రి శేషం నవీనాచార్యులు, లక్ష్మణ్ ఉన్నారు.
వక్ఫ్‌పై రాద్ధాంతం వద్దు
కరీంనగర్‌టౌన్: వక్ఫ్ చట్ట సవరణ జన జాగరణ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు దురిశె ట్టి సంపత్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తా నుంచి తెలంగాణచౌక్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టంపై కొందరు అపోహతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విచారకరమన్నారు. అన్యాయానికి గురవుతున్న నిరుపేద ముస్లింలకు న్యాయం చేయడానికి మోడీ ప్రభుత్వం వక్ఫ్‌పై సవరణలు చేపడితే, కొంతమంది పనిగట్టుకుని తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముస్లింల ఆస్తులను దోచుకుని, వక్ఫ్‌బోర్డుతో ఇన్నేళ్లు ప్రయోజనం పొందిన వారికి సవరణ చట్టం మింగుడు పడటం లేదన్నారు. నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మహమ్మద్ ముజీబ్, కటకం లోకేశ్, శ్రీరాముల శ్రీకాంత్, శశిధర్‌రెడ్డి, పుప్పాల రఘు, నాగసముద్రం ప్రవీణ్, సమీ పర్వేజ్ పాల్గొన్నారు.
యువజన సంఘాలను భాగస్వామ్యం చేయండి
కరీంనగర్‌స్పోర్ట్స్: నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ప్రతీ కార్యక్రమంలో యువజన సంఘాలను భాగస్వామ్యం చేయాలని కోరు తూ ఎన్‌వైకే కోఆర్డినేటర్ ఎం వెంకటరాంబాబుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా యువజన అవార్డీ లు, యువజన సంఘాల బాధ్యులు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకలను గ్రామీణ ప్రాంతాలకు చెరవేసేందుకు యువజన సంఘాలపాత్ర కీలకమన్నారు. నెహ్రు యువ కేంద్ర, యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో యువజన సదస్సులు, సమావేశలు, క్రీడా పోటీలు నిర్వహించి గ్రామీ ణ ప్రాంతాల్లో ఉన్న యువత ప్రతిభను వెలికితీయనున్నట్లు తెలిపారు. అవార్డు గ్రహీతలు ఏ.కిరణ్ కుమార్, రెండ్ల కళింగ శేఖర్, అలువా ల విష్ణు, మహ్మద్ అజమ్, శ్రీనివాస్, వొడ్నాల రాజు, తొర్తి శ్రీనివాస్, అజయ్, శ్రీనివాస్, అశోక్, వసంతరావు, భూంరెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్ జాగ్రత్తలను వివరించండి
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు, రైతులకు విద్యుత్ భద్రత జాగ్రత్తల గురించి వివరిస్తూ ప్రమాదాలు జరగకుండా చూడాలని ఉద్యోగులకు టీజీఎన్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్) అశోక్ సూచించారు. విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని విద్యుత్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. విద్యుత్ ప్రమాదాల నివారణలో ఉద్యోగులదే ప్రధాన పాత్ర అన్నారు. కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేష్‌బాబు, డీఈలు కే.ఉపేందర్, జంపాల రాజం, ఏడీఇలు పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎం.లావణ్య పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు రండి

బ్రహ్మోత్సవాలకు రండి

బ్రహ్మోత్సవాలకు రండి