
కాంగ్రెస్ నుంచి ‘పురుమల్ల’ సస్పెన్షన్
● పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వేటు
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గత జనవరిలో ఇచ్చిన సంజాయిషీ సంతృప్తికరంగా లేనందున పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతేడాది డిసెంబర్‌లో డీసీసీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావును ఉద్దేశించి పురుమల్ల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణా కమిటీ జనవరి 6వ తేదీన షోకాజు నోటీసు జారీ చేయగా, అదేనెల 11వ తేదీన పురుమల్ల వివరణ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన డీసీసీ కార్యాలయంలో జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి పరోక్షంగా పురుమల్ల మరోసారి చేసిన ఘా టు వ్యాఖ్యలతో గొడవ చెలరేగడం తెలిసిందే. ఈ గొడవపై ఇరువర్గాలు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకొన్నాయి. ఈ క్రమంలోనే జనవరి 11వ తేదీన ఇచ్చిన సంజాయిషీ సంతృప్తిగా లేదంటూ పురుమల్లపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ చాలా సమయం ఇచ్చినా శ్రీని వాస్ ప్రవర్తనలో మార్పు లేనందున, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని సస్పెండ్ చేస్తున్నట్లు చిన్నారెడ్డి ఆ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
స్వల్పంగా పెరిగిన పత్తి ధర
జమ్మికుంట: స్థానిక మార్కెట్‌లో పత్తిధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటాల్ కు రూ.7,400 కాగా మంగళవారం రూ.150 పెరిగి, గరిష్ట ధర రూ.7,550 పలికింది. మార్కెట్‌కు 57క్వింటాళ్ల పత్తిని రైతులు అ మ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,400, కనిష్ట ధర రూ.7,100కు ప్రైవే టు వ్యాపారులు కొనుగోలు చేశారు.