కొండగట్టు ఘాట్‌రోడ్డుపై ప్రమాదం
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన సంఘటనలో నలుగురు గాయపడ్డారు. రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన కుటుంబం వినోద్ కుటుంబ తగాదాలతో రెండు రోజుల క్రితం కొండగట్టుకు వచ్చాడు. ఆయన ఆచూకీ తెలుసుకున్న ఆయన భార్య శ్రీవాణి కూతురు వేదాంశిక, బంధువుతో కలిసి కొండగట్టుకు చేరుకున్నారు. అక్కడున్న భర్త వినోద్‌తో కలిసి బైక్‌పై నలుగురు ఘాట్ రోడ్డు వెంట వెళ్తుండగా.. బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కిందపడ్డారు. ఈ సంఘటనలో నలుగురూ గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఈఎంటీ జ్యోతి, పైలట్ ఆంజనేయులు బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బ్రేక్ ఫెయిల్ అదుపు తప్పిన బైక్
నలుగురికి గాయాలు


