సిరిసిల్ల: వస్త్రోత్పత్తిదారులు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వస్త్రోత్పత్తిదారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్, సంక్షేమశాఖల వస్త్రోత్పత్తి ఆర్డర్లను వెంటనే అందించాలన్నారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, టెక్స్‌టైల్ పార్క్ అధ్యక్షుడు అన్నల్‌దాస్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
కారుణ్య నియామకాలు
సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల వారసులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కారుణ్య నియామకపత్రాలు అందించారు. ప్రజా ఆరోగ్య విభాగంలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా పనిచేసే సిరిగిరి నర్సింహులు అనారోగ్యంతో 2020లో మరణించగా.. అతని కుమారుడు సిరిగిరి రాజుకు ఉద్యోగ నియామకపత్రం అందించారు. నగునూరి నాంపల్లి 2023 మరణించగా అతని భార్య నగునూరి లతకు నియామకపత్రం అందించారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు.
అర్హులకు ఓటుహక్కు కల్పించాలి
జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారికి ఓటుహక్కు కల్పించాలని కలెక్టర్ కోరారు. శుక్రవారం రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాకుండా ఓటర్ జాబితా సవరణపై రాజకీయ నాయకుల ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 2,30,157 మంది పురుషులు, 2,47,977 మంది మహిళా ఓటర్లు, 38 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాధాభాయి, రాజేశ్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు నాగుల శ్రీనివాస్, సంపత్, రాజన్న, రమేశ్, రమణ, ఎన్నికల సిబ్బంది రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా