సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్లో ఫుడ్‌ పాయిజన్‌ | Sakshi
Sakshi News home page

సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్లో ఫుడ్‌ పాయిజన్‌

Published Sat, Apr 20 2024 1:45 AM

చికిత్స పొందుతున్న రమేశ్‌ - Sakshi

20 మంది విద్యార్థులకు అస్వస్థత

సుల్తానాబాద్‌: సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని శాస్త్రినగర్‌ ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో శుక్రవారం ఉదయం టిఫిన్‌ చేసిన విద్యార్థులకు వాంతులు, విరేచనాలయ్యాయి. సిబ్బంది వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురు నలుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సైలెన్‌ ఎక్కించారు. మిగిలిన వారి ఆరోగ్యం సాయంత్రం వరకు కుదుటపడటంతో హాస్టల్‌కు తరలించినట్లు డాక్టర్‌ వెంకటేశ్‌ తెలిపారు. అల్పాహారంలో ఆయిల్‌ ఎక్కువ వాడటం వల్ల పిల్లలు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. హాస్టల్‌కు పంపించిన పిల్లలకు స్టాఫ్‌ నర్స్‌ ఆధ్వర్యంలో కొబ్బరి బోండాలు, గ్లూకోజ్‌ అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సత్యప్రసాద్‌ రాజు పేర్కొన్నారు.

పిడుగు పడి ఒకరికి తీవ్ర గాయాలు

మెట్‌పల్లిరూరల్‌: మండలంలోని ఆత్మకూర్‌లో పిడుగు పడి, ఒకరికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల ప్రకా రం.. ఆత్మకూర్‌కు చెందిన కోరుట్ల రమేశ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తుండటంతోపాటు ఖాళీగా ఉన్న సమయంలో కూలీ పనులకు వెళ్తున్నాడు. శుక్రవారం సాయంత్రం గాలిదుమారం వచ్చి, ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో అతను గ్రామంలో చెట్టు కింద ఆగాడు. అదే సమయంలో పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన మెట్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు

సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన రెండు ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్లిన దొంగను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ రఘుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఈ నెల 10న సిరిసిల్ల పాత బస్టాండ్‌ ఏరియాలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఎదుట నిలిపిన, సినారె గ్రంథాలయం ఎదుట పార్కింగ్‌ చేసిన బైకులు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సిరిసిల్ల పట్టణం వెంకంపేటలో ఉండే చెందిన కోల రవిగౌడ్‌ను దొంగగా తేల్చారు. ఇతను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పరీద్‌పేటకు చెందినవాడని, ఉపాధి నిమిత్తం సిరిసిల్లలో ఉంటున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఎత్తుకెళ్లిన వాహనాల్లో ఒకటి పొదల్లో దాచిపెట్టాడని, మరోదానిపై సిరిసిల్ల బైపాస్‌ రోడ్డుమీదుగా వెళ్తుంటే పట్టుకున్నామని తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది విధుల బహిష్కరణ

పెద్దపల్లిరూరల్‌: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి వెంటనే వేతనాలను ఇప్పించాలంటూ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి, కేవీపీఎస్‌ నాయకులు అశోక్‌, రవీందర్‌ డిమాండ్‌ చేశా రు. వీరి ఆధ్వర్యంలో శుక్రవారం సిబ్బంది విధులు బహిష్కరించారు. శానిటేషన్‌, పేషంట్‌కేర్‌, సెక్యూరిటీ తదితర విభాగాల్లో పని చేసే కార్మికులకు ఏడాదిగా వేతనాలు ఇవ్వ డం లేదన్నారు. వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సదరు కాంట్రాక్టర్‌తో మాట్లాడి కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరారు.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement