
మాట్లాడుతున్న ఈశక్
సప్తగిరికాలనీ(కరీంనగర్): సమాజ మార్పునకు ఓటు హక్కు అత్యంత కీలకం అని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) నగర ఉపాధ్యక్షుడు ఎల్కటురి ఈశక్ అన్నారు. గురువారం నగరంలో జరిగిన ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ఓటు హక్కు భారత రాజ్యాంగంలో అందించారని తెలిపారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం అందరి బాధ్యత అని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థి నాయకులు శివమణి, విష్ణు, పవన్, అభిలాష్, సాయికిరణ్, నీరజ్, గిరిచరన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.