
మాట్లాడుతున్న డీఆర్డీవో శ్రీలత
కరీంనగర్ అర్బన్: నీటిని పొదుపుగా వాడటం భావి తరాలకు మేలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎల్.శ్రీలత అన్నారు. గురువారం యూనిసెఫ్ అధ్వర్యంలో 15 మండలాల సమాఖ్యల బాధ్యులతో నీటి నాణ్యత.. వినియోగంపై సదస్సు నిర్వహించారు. శ్రీలత మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీరు అన్ని విధాలుగా శ్రేయస్కరమని తెలిపారు. నీటి శుభ్రతను పాటిస్తూ పొదుపుగా వినియోగించడమే ముందున్న మార్గమని వివరించారు. యూనిసెఫ్ రాష్ట్ర ప్రతినిధి కాశీనాథ్ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన నీరు, వ్యక్తిగత శుభ్రత అవసరమని తెలిపారు. నీటి నాణ్యత, వినియోగంపై అవగాహన పెంచుకోవాలని డిప్యూటీ ఈఈ యంబి ప్రభాకర్ సూచించారు. అనంతరం బోర్‌వెల్, ఆర్‌వో, ఎంబీ వాటర్‌ను పలు పద్ధతుల్లో పరీక్షించి నాణ్యతను వివరించారు. యూనిసెఫ్ ప్రాజెక్టు సమన్వయకర్త కిషన్‌స్వామి, ఎస్‌బీఎం కన్సల్టెంట్ రమేశ్, వేణు, ఫెసిలిటేటర్లు రవి, వెంకటేశ్, కల్యాణి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు హరిణి, కార్యదర్శి పుష్ప తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎల్.శ్రీలత