
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన పల్లె స్వరూప మంగళవారం ఉగాది మగువ జా తీయ పురస్కారం అందుకున్నారు. హనుమకొండ జిల్లా పర్కాలలో క్రాంతి జ్యోతి మహిళా సాధికారత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డును నిర్వాహకులు అందించారు.
ఆర్టీసీ ద్వారా భద్రాద్రి
గోటి ముత్యాల తలంబ్రాలు
విద్యానగర్(కరీంనగర్): భద్రాచలంలో ఈ నెల 30న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సంబంధించి గోటి ముత్యాల తలంబ్రాలను ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ద్వారా భక్తులకు చేరవేయనున్నట్లు కరీంనగర్ జోన్ లాజిస్టిక్స్ విభాగం డిప్యూటీ సీటీఎం కేశరాజు భానుకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖ సహకారంతో తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు వెళ్లి, అందించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. స్వామివారి తలంబ్రాలు కావాల్సినవారు సమీప లాజిస్టిక్స్ కౌంటర్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వద్ద రూ.116 చెల్లించి, వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. బుక్ చేసుకున్న భక్తులకు ఏప్రిల్ 3వ తేదీ నుంచి తలంబ్రాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.