
మాట్లాడుతున్న డాక్టర్ పద్మజ
జమ్మికుంట(హుజూరాబాద్): రైతులు పంటలకు రసాయన ఎరువుల మోతాదు తగ్గించి, సేంద్రయ ఎరువుల వాడకం పెంచాలని, నేల సంరక్షణ దిశగా అడుగులు వేయాలని డైరెక్టర్ ఆఫ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ పద్మజ, రిటైర్డ్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ చంద్రశేఖర్‌రావు, డీఏవో శ్రీధర్‌లు అన్నారు. మంగళవారం జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో భారత ఎరువుల సంఘం(ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఎరువుల వినియోగంపై రైతులు, డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాగులో సమగ్ర పోషణ, యాజమాన్య పద్ధతులు, భూసార పరీక్షల ఆధారంగా నేల స్వభావం తెలుసుకొని, ఎరువుల వినియోగించాలని చెప్పారు. ఫలితంగా నేల సంరక్షణతోపాటు పంటల ఖర్చు తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు వాడే ఎరువుల్లో 30 నుంచి 35 శాతం మాత్రమే మొక్కలు తీసుకుంటాయని, మిగతావి వృథా అవుతాయని తెలిపారు. వాతావరణ మార్పలకు అనుగుణంగా పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో కేవీకె సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్‌రావు, సుబ్బారెడ్డి, సేద్యపు విభాగ శాస్త్రవేత్త విజయ్, డిప్లొమా(అగ్రికల్చర్) విద్యార్థులు పాల్గొన్నారు.
స్లాటర్ హౌస్ ఓపెన్ టెండర్
కరీంనగర్ సిటీ: స్లాటర్ హౌస్ ఓపెన్ టెండర్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో మేయర్ యాదగిరి సునీల్ అధ్యక్షతన నగరపాలక సంస్థ వధశాల ఓపెన్ టెండర్ మంగళవారం నిర్వహించారు. ఆరుగు రు వ్యాపారులు పాల్గొనగా ఇబ్రహీం రూ.15.35 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం టెండర్ అగ్రిమెంట్ పత్రాలను మేయర్ ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, సరిల్ల ప్రసాద్, వాల రమణారావు, గందె మాధవి, కోల మాలతి, తుల రాజేశ్వరి, పిట్టల వినోద తదితరులు పాల్గొన్నారు.
