
విద్యార్థులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు
రమజాన్ అంటే స్నేహం. నేనున్నానని చెప్పడం, నువ్వున్నావని గుర్తు చేసుకోవడం.
– మహ్మద్ ప్రవక్త
సహర్
4:47
ఇఫ్తార్
6:32
గురు
బుధ
మంత్రి గంగుల క్యాంప్ ఆఫీస్ ముట్టడి
కరీంనగర్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కారకులపై చర్యలు తీసుకోవాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని, లీకేజీకి రాష్ట్ర ప్రభుత్వం నైతిక భాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ టీఎస్పీపీఎస్‌సీ చైర్మన్‌ను వెంటనే తొలగించి హైకోర్టు జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు టీఎస్‌పీఎస్‌సీ మీద ఆధారపడి చదువుకుంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు సకాలంలో ఉన్నతమైన విద్య అందించడంలో విఫలమైందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడంలో పేపర్లను డబ్బులకు కక్కుర్తి పడి అమ్ముకోవడంలో మంత్రి కేటీఆర్ హస్తం ఉందన్నారు. సిట్ ద్వారా దర్యాప్తు చేపిస్తున్నామని పేపర్ల ప్రకటననే కనిపిస్తోందన్నారు. నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుందని అన్నారు. లేనిపక్షంలో మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని కరీంనగర్ గడ్డ నుంచి తెరలేపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు రంజిత్, పూసాల విష్ణు, నందు, వేణు, శివ, సాయికృష్ణ పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
