
మాట్లాడుతున్న శంకర్‌రావు
జమ్మికుంట(హుజూరాబాద్): రైల్వే కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.శంకర్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం జమ్మికుంటలోని రైల్వే ప్రాంగణంలో సంఘం ఆధ్వర్యంలో సింహ గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. సికింద్రాబాద్ డివిజన్ వ్యాప్తంగా ఆయా విభాగాలకు చెందిన కార్మికులు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వేలో ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేసి, కార్మికులు, ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. యూనియన్ ఆధ్యక్షుడు కాలువ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజన్ కార్యదర్శి పిల్లలమర్రి రవీందర్, జమ్మికుంట బ్రాంచి చైర్మన్ రాజయ్య, కారదర్శి శ్రీనివాస్, క్రాంతికుమార్, సాంబరాజు, మహేశ్, స్వప్న, జగన్, సౌత్ సెంట్రల్ జోన్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్‌రావు
జమ్మికుంటలో బహిరంగ సభ