
గంగాధర(చొప్పదండి): పేద ప్రజలకు అండగా ప్రభుత్వం సీఎం సహాయనిధిని అందిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.11,14,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఆస్పత్రిలో అత్యవసర సమయాల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం సీఎం సహాయనిధి అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ఇ క్కడ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.