
పంటను పరిశీలిస్తున్న పొన్నం ప్రభాకర్
● మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్
రామడుగు: వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతుల పంటలను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద పరిహారం అందించేలా ఎంపీ బండి సంజయ్‌కుమార్ కృషి చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. రామడుగు మండలం రాంచంద్రాపూర్, చిప్పకుర్తి, గుండి, దత్తోజీపల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు హామీలు ఇవ్వకుండా, తక్షణ పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అందించిన విధంగా పంటలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, కాంగ్రెస్ మహిళా ఆధ్యక్షురాలు సత్యప్రసన్న, బీసీ సెల్ చైర్మన్ పులి అంజనేయులుగౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య, నాగి శేఖర్, పంజాల శ్రీనివాస్‌గౌడ్, కాడె శంకర్, బుచ్చయ్య, రాజిరెడ్డి, తిరుపతి, రాజేశం, మాధవరెడ్డి ఉన్నారు.