గుడుంబా పట్టివేత

మాట్లాడుతున్న జీఎం వెంకటేశ్వర్లు - Sakshi

జమ్మికుంట: గుడుంబా తయారుచేసి, రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకుని కేసు నమోదుచేసిన ట్లు ఎకై ్సజ్‌ సీఐ అక్బర్‌ హుస్సేన్‌ బుధవారం తెలిపారు. ఎకై ్సజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శంకరపట్నం మండలం మెట్టుపల్లికి అంగిడి రమేశ్‌ గుడుంబా తయారుచేసి, జమ్మికుంట పట్టణంలో అమ్మేందుకు అక్రమ రవాణా చేస్తున్న క్రమంలో ఎకై ్సజ్‌ పోలీసులు పట్టు కున్నారు. 10 లీటర్ల గుడుంబాతో పాటు మో పెడ్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గు డుంబా తయారుచేసినా, విక్రయించినా రవాణాచేసినా కేసులు నమోదుచేస్తామని రూ. లక్ష జరిమానాతో పాటు నిందితుడిని బైండోవర్‌ చేస్తామని హెచ్చరించారు.నిందితుడిని పట్టుకు న్న ఎస్సై కబీర్‌దాస్‌, కానిస్టేబుల్‌ విశ్వజ్ఞలను అభినందించారు.

సింగరేణి సంస్థ

అభివృద్ధికి తోడ్పడాలి

రామగిరి(మంథని): శోభకృత్‌ నామ సంవత్స రంలో కార్మికులు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఏపీఏ జీఎం కొప్పుల వెంకటేశ్వర్లు కోరారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఉగాది సందర్భంగా ఏ పీఏ పరిధి అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్ట్‌ వద్ద బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని కార్మికులను ఉద్ధేశించి మాట్లాడా రు. ఈ సందర్భంగా కార్మికులకు సీఅండ్‌ఎండీ నడిమెట్ల శ్రీధర్‌ సందేశాన్ని చదివి వినిపించా రు. ఎనిమిదేళ్లలో సింగరేణి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. గని మేనేజర్‌ జనార్ద న్‌, సేఫ్టీ ఆఫీసర్‌ రమేశ్‌, టీబీజీకేఎస్‌ ఫిట్‌ సెక్రెటరీ దాసరి మల్లేశ్‌, ఇతర అధికారులు, వివిధ పార్టీల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

యూనియన్‌ ఆవిర్భావానికి 25 ఏళ్లు పూర్తి

రామగుండం: తెలంగాణ స్టేట్‌పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌పీఈయూ–1535) ఆవిర్భవించి బుధవారంతో 25 ఏళ్లు పూర్తయి నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం కుమారస్వామి తెలిపారు. ఈమేరకు రామగుండం బీ –థర్మల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ పి.విజేందర్‌కు యూనియన్‌ ప్రతినిధులు జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ తఖీ, రామగుండం బ్రాంచి అధ్యక్షుడు అబ్దుల్‌ నజ్మీ, సమియొద్దీన్‌, శ్రీనివాస్‌, ఖమరొద్దీన్‌, నయింపాషా, స్వామి, రాధ,లక్ష్మి, సరోజన తదితరులున్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top