సమన్వయంతో పని చేయాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పని చేయాలి

Mar 25 2026 7:29 AM | Updated on Mar 25 2026 7:29 AM

కామారెడ్డి క్రైం: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ విక్టర్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సమావేశాన్ని నిర్వహించారు. అతి భారీ వర్షాలు, వరదలు లాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించాలన్నారు. సమాచారం, సహాయక చర్యలు, పునరావాసం కల్పించడం లాంటి అంశాలపై ముందస్తు ప్రణాళికలు ఉండాలని సూచించారు. గతంలో జరిగిన వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆర్డీవో వీణ, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి రవీందర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement