కామారెడ్డి క్రైం: నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలను కాపాడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులతో కలెక్టర్ నీటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని పొదుపుగా వినియోగించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. ఒక్క బొట్టు కూడా వృథా చేయరాదన్నారు. నీటిని అత్యంత విలువైన వనరుగా గుర్తించి అవగాహన పెంచుకోవాలన్నారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, జెడ్పీ సీఈవో చందర్, ఆర్డీవో వీణ, భూగర్భ జలశాఖ అధికారి సతీశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


