నిధులు దుర్వినియోగం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

నిధులు దుర్వినియోగం చేయొద్దు

Mar 18 2026 7:46 AM | Updated on Mar 18 2026 7:46 AM

ఎల్లారెడ్డి: ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించాలని, నిధులు దుర్వినియోగం చేయొద్దని ఏపీడీ వామన్‌రావు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. 2024 ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31, 2025 వరకు నిర్వహించిన ఉపాధిహామి పనులకు సంబంధించి సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. 2024– 2025 ఆర్థిక సంవత్సరంలో ఎల్లారెడ్డి మండలంలో రూ.3 కోట్ల 69 లక్షల 79 వేల 822 పనులు జరిగాయని తెలిపారు. వీటిలో రూ.7 వేల నిధులను రికవరీ చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు సూర్యాజీ, వినోద్‌, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement