భిక్కనూరు : పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి భరత్ కుమార్ సూచించారు. మంగళవారం గుర్జకుంటలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా వెంటనే పశు వైద్య సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. వచ్చేనెల 9 వరకు జిల్లాలో పశువైద్య శిబిరాలను నిర్వహిస్తామని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి దేవేందర్, పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.


