పలు గ్రామాలలో వడగండ్ల వర్షం | - | Sakshi
Sakshi News home page

పలు గ్రామాలలో వడగండ్ల వర్షం

Mar 18 2026 7:46 AM | Updated on Mar 18 2026 7:46 AM

పలు గ్రామాలలో వడగండ్ల వర్షం

ఎల్లారెడ్డిరూరల్‌: మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం రాత్రి వడగండ్ల వర్షం కురిసింది. మండలంలోని మత్తమాల, అల్మాజీపూర్‌, రుద్రారం, మల్కాపూర్‌ గ్రామాలలో వడగండ్ల వర్షం కురిసింది. వర్షం వలన పొట్ట దశలో ఉన్న వరి పంటకు నష్టం కలుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

పోటీ పరీక్షలకు

ప్రత్యేక శిక్షణ

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయాన్ని యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ వాసంతి తెలిపారు. జిల్లాలో 19 కేజీబీవీలు ఉండగా లింగంపేట, భిక్కనూరు, నిజాంసాగర్‌ కేజీబీవీలు ఎంపికై నట్లు తెలిపారు. ఇక నుంచి విద్యార్థులకు ‘నీట్‌’కు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకునే పరిస్థితి ఉండదు, అలాగే రూ.లక్షలు ఖర్చు పెట్టే స్థోమత లేకపోవడంతో ఎంతో మంది నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో గ్రామీణ పేద విద్యార్థులకు వరంగా ప్రభుత్వం కేజీబీవీల్లో ఎన్‌ఈఈటీ(నీట్‌)కు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరానికి మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 15 వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలన్నారు. మే 3న టీజీఆర్‌జేసీ సెట్‌–2026 ద్వారా ప్రవేశ పరీక్షల నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఇందులో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. జీఈసీవో సుకన్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement