నాడు తండ్రి.. నేడు కుమారుడు సర్పంచ్
బాన్సువాడ రూరల్: సంగోజీపేట్ గ్రామానికి చెందిన మంద సంగమేశ్వర్ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. సంగమేశ్వర్ తండ్రి దివంగత మంద శ్రీరాములు కూడా 2006 నుంచి 2011 వరకు గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సంగమేశ్వర్ పంచాయతీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి నాగభూషణంపై 252 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇదిలా ఉంటే 2006లో జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లోనూ ఈ రెండు కుటుంబాల మధ్య సర్పంచ్ స్థానానికి పోటీ జరిగింది. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసిన సంగమేశ్వర్ తండ్రి మంద శ్రీరాములు, నాగభూషణం కుటుంబానికి చెందిన అతని బాబాయి దివంగత మార్ధాండి నర్సప్పలు ప్రత్యర్థులుగా పోటీచేయడం కొసమెరుపు.
మంద సంగమేశ్వర్, సంగోజీపేట్, సర్పంచ్
మంద శ్రీరాములు, మాజీ సర్పంచ్
నాడు తండ్రి.. నేడు కుమారుడు సర్పంచ్


