వార్డు మెంబర్ల గెలుపు.. సర్పంచ్ అభ్యర్థుల ఓటమి
బాన్సువాడ రూరల్: ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లో చర్చకు వచ్చే క్రాస్ ఓటింగ్ సమస్య మారుమూల పల్లెల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది. 3వ విడత పంచాయతీ ఫలితాల్లో తిర్మలాపూర్, హన్మాజీపేట్ గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వార్డు సభ్యులు విజయం సాధించగా, సర్పంచ్ అభ్యర్థులు మాత్రం ఓటమి పాలయ్యారు. జనరల్ మహిళగా రిజర్వు అయిన తిర్మలాపూర్ గ్రామ పంచాయతీలో మ్యాడ అనసూయ అధికార కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉండగా గొల్ల లక్ష్మి రెబెల్‌గా బరిలో దిగారు. కౌంటింగ్‌లో 8 వార్డులకు గానూ ఆరుగురు వార్డు సభ్యులు మ్యాడ అనసూయ మద్దతుదారులు గెలుపొందారు. కేవలం ఇద్దరు మాత్రమే గొల్ల లక్ష్మి మద్దతుదారులు గెలుపొందారు. వార్డు సభ్యుడిగా పోటీచేసిన సర్పంచ్ అభ్యర్థి భర్త గొల్ల బాలయ్య సైతం ఓటమి పాలయ్యారు. తీరా సర్పంచ్ ఫలితాలు వెలువడే సరికి గొల్ల లక్ష్మి 71 ఓట్ల మెజారిటీతో గెలుపొందడంతో మద్దతుదారులు కంగుతిన్నారు.ఇక హన్మాజీపేట్ గ్రామ పంచాయతీలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బండారు రుక్క వ్వ బరిలో ఉండగా రెబెల్‌గా ఆశనుగొల్ల లావణ్య వెంకాగౌడ్ పోటీ పడ్డారు.10 మంది వార్డు సభ్యు ల్లో 8 మంది రుక్కవ్వ మద్దతుదారులు గెలుపొంద గా ఇద్దరు వార్డు సభ్యులు మాత్రమే లావణ్య మ ద్దతుదారులు గెలుపొందారు. విజయం పక్కా అనుకున్న బండారి రుక్కవ్వ మద్దతుదారులకు స ర్పంచ్ ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఇక్కడ రెబెల్‌గా పోటీ చేసిన లావణ్య వెంకాగౌడ్ 158 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందడం ఆశ్చర్యం కలిగించింది. తమ మద్దతుతో గెలుపొందిన వార్డు సభ్యులు సంబురాలు చేసుకుంటుంటే ఓడిన సర్పంచ్ అభ్యర్థులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. పల్లెల్లోనూ క్రాస్ ఓటింగ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
తిర్మలాపూర్ గ్రామ ముఖచిత్రం
క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్


