నాడు పతి.. నేడు సతి
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో సర్పంచులుగా నాడు పతులు పదవులు నిర్వహిస్తే నేడు సతులు సర్పంచులుగా గెలుపొందారు. రేపల్లెవాడ సర్పంచ్‌గా నాడు దుద్దుల సాయిరాం సర్పంచ్‌గా పని చేశారు. 2018లో సర్పంచ్‌గా గెలిచి ఐదేళ్ల పాలన పూర్తి చేశారు. నేడు రేపల్లెవాడ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో సాయిరాం తన భార్య వనితతో పోటీ చేయించారు. దీంతో దుద్దుల వనిత సర్పంచ్‌గా గెలుపొందారు. అలాగే అల్మాజీపూర్ గ్రామ సర్పంచ్‌గా నాడు 2018 ఎన్నికలలో పుల్గల మాధవి గెలుపొంది ఐదేళ్ల పాటు సర్పంచ్‌గా పని చేశారు. నేడు అల్మాజీపూర్ జీపీ జనరల్ స్థానానికి కేటాయించడంతో మాధవి భర్త పుల్గల దేవదత్తు సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు.
నాడు పతి.. నేడు సతి
నాడు పతి.. నేడు సతి


