సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి టౌన్: యువత సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కళాబృందం సభ్యులు తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని వశిష్ట జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు ఆన్‌లైన్, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. అమ్మాయిలు వేధింపులకు గురైతే షీటీంలను సంప్రదించాలన్నారు. హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషారావు, షీ టీం సభ్యులు సౌజన్య, భూమయ్య, కళాశాల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాథమికోన్నత పాఠశాలలో షీ టీం కానిస్టేబుళ్లు శ్రీశైలం, సుప్రజ సోమవారం పలురకాల సైబర్‌నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం టోల్‌ఫ్రీ నంబర్ 87126 86094, సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నంబర్ 1930, అత్యవసరాల సమయంలో వినియోగించే 100నంబర్ గురించి విద్యార్థులకు వారు తెలియజేశారు. పాఠశాల హెచ్‌ఎం ఉదయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి


