గ్రూప్–1 విజేతలకు అభినందనలు
కామారెడ్డి క్రైం: ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో ఎంపికై న జిల్లాకు చెందిన అభ్యర్థులు సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేసి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని కలెక్టర్ అభినందిందిచి జ్ఞాపికలను అందజేశారు. గ్రూప్–1 సాధించిన వారిలో పెద్దకొడప్‌గల్‌కు చెందిన అభినవ్, ఎల్లారెడ్డికి చెందిన ఎండీ.తాహెరా బేగం, బీర్కూర్‌కు చెందిన శ్రీనిధి, నిజాంసాగర్‌కు చెందిన శివకృష్ణ ఉన్నారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ రవితేజ పాల్గొన్నారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): నేషనల్ రోడ్డు అఽథారిటీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సాఽరథి కళాకారులు సోమవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రోడ్డు ప్రమాదాలు, భద్రత, డ్రగ్స్‌పై ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై అరుణ్ కుమార్, రోడ్డు అథారిటీ అధికారి రాజ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్–1 విజేతలకు అభినందనలు


