‘గాలికుంటు’ టీకాలు వేయించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని మండల పశువైద్యాధికారి రమేశ్ అన్నారు. నందివాడలో సోమవారం పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. జీవాలకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఏ సీజన్‌కు సంబంధించి ఆ సీజన్ మందులను వే యించాలని సూచించారు. ఈ సందర్భంగా 98 ఆ వులు, 203 గేదెలకు టీకాలు వేశారు. వైద్య సిబ్బంది పోచయ్య, కొండల్‌రెడ్డి, ప్రేమ్‌సింగ్, గోపాల మిత్రలు మహిపాల్‌రెడ్డి, బ్రహ్మం పాల్గొన్నారు.


