
తాటిపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం
సిరికొండ: నిజామాబాద్ సిరికొండ అటవీ రేంజ్ పరిధిలోని తాటిపల్లి, జినిగ్యాల బీట్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తాటిపల్లి శివారులోని మల్లం చె రువు, తాంట్ల కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లినవారికి పాద ముద్రలు కనిపించాయి. అనుమానం వ చ్చి సమాచారం ఇచ్చారని రేంజర్ రవీందర్ తెలిపా రు. ఆర్మూర్ ఎఫ్‌డీవో భవానీశంకర్, రేంజ్ ఆఫీసర్ రవీందర్, యానిమల్ ట్రాకర్స్, ఎన్‌జీవో వెంకట్, రేంజ్ సిబ్బంది శుక్రవారం ఆయా ప్రాంతాల్లో సంచరించారు. పాదముద్రలను పరిశీలించి మగ పెద్దపులిగా నిర్ధారించారు. గతంలో ఏటీఆర్ ఖానాపూర్ ఏరియా అటవీ ప్రాంతంలో సంచరించిన ఎస్12 పెద్దపులి అని గుర్తించారు. ఐదారు నెలల నుంచి జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ పరిధిలో తిరిగి ఇటువైపు వచ్చినట్లు రేంజర్ తెలిపారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న తండాలకు చెందిన గిరిజనులు, మేకల, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు పొలాల వద్ద కరెంటు తీగలను ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నారు. అటవీ అధికారులు, యానిమల్ ట్రాకర్స్ ప్రతిరోజు గస్తీ తిరుగుతూ పులి కదలికలను పసిగడతామని, సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు రేంజర్ వివరించారు.