
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు రిజర్వేషన్ల కోసం కృషి
● యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివచరణ్‌రెడ్డి
బాన్సువాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సభ్యులకు 25 శాతం సీట్లు కేటాయించే విధంగా కృషి చేస్తానని యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివచరణ్‌రెడ్డి అన్నారు. స్థానిక శ్రీనివాస గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు పక్కన బెట్టి అందరూ కలిసిమెలిసి పని చేయాలన్నారు.
మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలి : పోచారం భాస్కర్‌రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. యూవజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఇంచార్జి అమృత, యువజన నాయకులు కాసుల రోహిత్, పీసీసీ డెలిగేట్ రాజిరెడ్డి, మన్సుర్, శ్రీనివాస్, సర్ధార్, దుర్గం శ్యామం, అజయ్ తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి ిసీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజారెడ్డి
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి సీఐగా రాజారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్ సీసీఎస్ లో పనిచేస్తున్న ఆయన బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చారు. గతంలో సీఐగా విధులు నిర్వహించిన రవీందర్ నాయక్ ఐజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ రాజారెడ్డి పేర్కొన్నారు.

యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు రిజర్వేషన్ల కోసం కృషి