
జిల్లా జనాభా
1991లో
మొత్తం 7,64,241
పురుషులు 3,81,924
మహిళలు 3,82,317
2001లో
మొత్తం 8,79,373
పురుషులు 4,38,634
మహిళలు 4,40,739
2011లో
మొత్తం 9,74,227
పురుషులు 4,79,192
మహిళలు 4,95,035
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చదువులు ఖరీదైపోవడం ఏడాదికేడాది అన్నింటి ధరలు పెరిగిపోయి కుటుంబ పోషణ భారంగా మారిన పరిస్థితుల్లో సంతానానికి పరిమితులు విధించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి మంచి చదువు ఇవ్వలేమనే భావన పెరిగింది. దీంతో పరిమిత సంతానమే ముద్దనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఏర్పడింది. దీంతో చాలా మంది సంతానం అంటే.. ఒక్కరే చాలని అంటున్నారు. కాదూ కూడదంటే ఇద్దరితో ఆపేద్దామనే భావన మెజారిటీ ప్రజల్లో ఉంది. చదువుకున్న వారే కాకుండా సామాన్య ప్రజలు కూడా చిన్న కుటుంబానికే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా జనాభా పెరుగుదల శాతం ఏడాదికేడాది తగ్గిపోతోంది. కుటుంబాల సంఖ్య పెరిగినా, జనాభా పెరుగుదల మాత్రం ఆ స్థాయిలో కనబడడం లేదు. కామారెడ్డి జిల్లాలో 2001 జనాభా గణాంకాల ప్రకారం జనాభా వృద్ది 15 శాతం ఉంటే, 2011 కి వచ్చేసరికి జనాభా వృద్ది 8.8 శాతానికి పడిపోయింది. 2021లో చేపట్టాల్సిన జనాభా గణన కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం గడచిన పద్నాలుగేళ్ల కాలంలో జనాభా వృద్ధి 7.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
● 2021లో జనగణన చేపట్టలేదు. అయితే అంచనాల ప్రకారం 2025లో జిల్లా జనాభా 10,54,520 ఉంటుందని, ఇందులో పురుషులు 5,18,702, మహిళలు 5,35,818 మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఒక్కరు లేదా ఇద్దరు చాలు
ఆర్థికంగా ఉన్న వారు ఎంత మంది పిల్లలు ఉన్నా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కా నీ సామాన్య ప్రజలు ఎవరై నా సరే ఒక్కరు, లేదంటే ఇ ద్దరు సంతానం ఉండడమే మంచిది. పిల్లల చదువుల నుంచి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉండవు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటేనే మేలు. – ధన్‌రాజ్ – ప్రత్యూష, ఎల్లారెడ్డి
ఉమ్మడి కుటుంబాలు అవసరం
తక్కువ మంది సంతానంతో కుటుంబాలు చిన్నగా మారిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నపుడు అందరికీ అన్ని విషయాలపై అవగాహన ఉండేది. పాత రోజుల్లో ఒక్కో కుటుంబంలో నలుగురైదుగురు సంతానం ఉండేది. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే అయ్యాయి. దీంతో ఎవరికీ ఏమీ తెలియడం లేదు. – సంతోష్‌కుమార్, ఎల్లారెడ్డి

జిల్లా జనాభా