
యూరియా కొరత లేకుండా చూడాలి
కామారెడ్డి: యూరియా కొరత లేకుండా చూడాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం సదాశివనగర్ రైతు వేదిక భవనంలో మండల స్థాయి భారతీయ కిసాన్ సంఘ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రబీ సీజన్లో పండించిన సన్న వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ రూ. 2 లక్షలు వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన మార నారాయణరెడ్డిని నూతన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సంఘం మండల అధ్యక్షుడు కొప్పుల నర్సారెడ్డి, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, తదితరులు పాల్గొన్నారు.
కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలి
రాజంపేట: మహిళా సంఘాలు దివ్యాంగ కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి అన్నారు. రాజంపేట మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో ఆదాయాభివృద్ధి కార్యక్రమంలో బ్యాంకు రుణాలు, సీ్త్రనిధి, గ్రామ సంఘం రుణాల రికవరీలో రాజంపేట మండల మహిళా సంఘం మొదటి స్థానంలో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే కొత్తగా మహిళా సంఘాలు దివ్యాంగ కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమాఖ్య అధ్యక్షులు లక్ష్మి, ఏపీఎం సాయిలు, సీసీ శ్రీనివాస్, వీవోఏలు పాల్గొన్నారు.
ఆలయాలకు నూతన
కార్యవర్గం ఏర్పాటు
నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండాబాలాజీ, శంభులింగేశ్వరాలయం, హమాల్‌వాడి సాయిబాబా ఆలయాలకు నూతన పాలకవర్గం ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి జెండా బాలాజీ ఆలయానికి డైరెక్టర్లుగా ప్రమోద్‌కుమార్, నర్సింగ్‌రావు, కిరణ్‌కుమార్, వేముల దేవిదాస్, లక్ష్మణ్, విజయ, రాజ్‌కుమార్‌లు, హమాల్‌వాడి సాయిబాబా ఆలయానికి డైరెక్టర్లుగా గంగాకిషన్, శ్రీరాంశ్రీనివాస్, పవన్‌కుమార్, శివలింగం, శాంతాబాయి నియామకం అయ్యారు. శంభులింగేశ్వరాలయానికి డైరెక్టర్లుగా బి మధు, కిశోర్, సంతోష్‌కుమార్, కమలకిశోర్, మామిడిశేఖర్, రమేశ్, రేఖలను నియమించినట్లు జిల్లా ఎండోమెంట్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

యూరియా కొరత లేకుండా చూడాలి