
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఇంటెలిజెన్స్ ఎస్పీ రంజన్ రతన్ సూచించారు. బుధవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980–82 బ్యాచ్‌కు చెందిన ఇంటర్ పూర్వ విద్యార్థులు ఇదే కళాశాలలో గతేడాది టాపర్లుగా నిలిచిన మహాలక్ష్మి, నందినీలకు రూ. 10 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సైతం ఇదే కళాశాలలో ఇంటర్ చదివానన్నారు. చదువుతో పాటు క్రీడలలో రాణించడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. వచ్చే ఏడాది ఇంటర్ టాపర్లకు రూ. 25 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్ విశాల, లెక్చరర్లు రామచంద్రరావు, రమేష్, పూర్వ విద్యార్థులు ఆంజనేయులు, మూర్తి పాల్గొన్నారు.