
అమర్‌నాథ్ యాత్రను ఎప్పటికీ మరిచిపోలేము
అమర్‌నాథ్ యాత్రలో భాగంగా కశ్మీర్‌లో వైష్ణోదేవి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాం. పహల్గామ్ దాడి తరువాత భారత ప్రజలు భయపడకుండా అమర్‌నాథ్ యాత్రకు తరలివస్తున్నారు. భారత ప్రభుత్వం, భారత సైన్యం మీద ఉన్న అపార విశ్వాసానికి ఇది నిదర్శనం. యాత్ర కోసం భారత ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, కల్పించిన భద్రత అత్యద్భుతంగా ఉన్నాయి. అమర్‌నాథ్ యాత్ర పొడవునా సైన్యం అడుగడుగునా పహారా కాస్తోంది. దీంతో ఏమాత్రం భయం లేకుండా ప్రశాంతంగా యాత్ర చేయొచ్చు. భయం అనేదే లేకుండా యాత్ర చేమొచ్చు. కశ్మీర్ అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతి అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రకృతి కూడా ప్రస్తుతం పూర్తి అనుకూలంగా ఉంది. జూలై, ఆగస్టులో సందర్శిస్తే అద్భుతంగా ఉంటుంది. అమర్‌నాఽథ్ యాత్రలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉచితంగా అందిస్తున్నారు. దక్షిణ భారత, తెలుగు లంగర్లు చాలా ఉన్నాయి. – కరుటూరి పాపారావు, వెంకట సుబ్బలక్ష్మి, జైతాపూర్