ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

Jul 8 2025 5:18 AM | Updated on Jul 8 2025 5:18 AM

ఫిర్య

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చందర్‌ నాయక్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 107 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, పోడు పట్టాలు, పింఛన్‌లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఆర్డీవో వీణ, కలెక్టరేట్‌ పాలనాధికారి మసూర్‌ అహ్మద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వీధి దీపాలను ఏర్పాటు చేయండి

భిక్కనూరు: మండలం కేంద్రంలోని కుమ్మర్‌గల్లీ ప్రాంతంలో వీధి దీపాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్‌టీఐ జిల్లా ప్రతినిది గంగళ్ల రవీందర్‌ సోమవారం భిక్కనూరు తహసీల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ సునీతకు వినతిపత్రం అందించారు. వీధి దీపాల విషయమై జీపీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మురికి నీటితో అవస్థలు

ఇళ్ల మధ్య మురికి నీరు నిల్వ ఉండటంతో అవస్థలు పడుతున్నామని గాంధారిలోని 2వ వార్డు ప్రజలు తెలిపారు. సోమవారం వారు కలెక్టరేట్‌కు విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాలనీ చివర్లో మురికి కాలువ నిండిపోయి ప్రవాహం నిలిచిపోయిందన్నా రు. దీంతో కాలనీలోని ఖాళీ స్థలాల్లోకి మురికి కాలువల నీరు చేరుతుందని తెలిపారు. గ్రామ పంచాయితీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో విన్నవించారు.

పోడు పట్టాలకు రుణాలు ఇవ్వాలి

పోడు పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో పోడు సాగుదారులు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. సీపీఎం జిల్లా నాయకులు మోతీరాం, వెంకట్‌ రెడ్డిలు మాట్లాడుతూ.. జిల్లాలో 12 వేల మంది పోడు సాగుదారులు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని బ్యాంకర్లు పోడు పట్టాలకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. పోడు రైతులు తమ పంట పెట్టుబడుల కోసం ప్రైవేటుగా అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఇతర జిల్లాలలో పోడు పట్టాలకు ఇచ్చిన మాదిరిగానే మన జిల్లాలో కూడా రుణాలు ఇప్పించాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. అంతే కాకుండా గాంధారి మండలం మాతు సంగెం గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు రైతులను బెదిరించి ఆ భూమి నుంచి వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించి రైతులకు పట్టాలు ఇప్పించాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.

స్థానిక సంస్థల అదనపు

కలెక్టర్‌ చందర్‌ నాయక్‌

ప్రజావాణికి 107 వినతులు

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి 1
1/3

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి 2
2/3

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి 3
3/3

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement