
జై అమర్‌నాథ్..
అమర్‌నాథ్ యాత్రలో
ఇందూరు జిల్లా బృందం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భూతల స్వర్గంగా పేరుపొందిన కళ్మీర్‌లోని పహల్గామ్‌లో మన పర్యాటకులపై దాయాది దేశం ఉగ్రమూకలు దాడికి పాల్పడితే భారత ప్రభుత్వం, సైన్యం స్పందించిన తీరుపై యావత్ దేశం గర్వంతో ఉప్పొంగింది. భారత ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచారు. పహల్గామ్ మారణహోమం తమను ఏమాత్రం భయపెట్టలేదని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత పర్యాటక రంగ అభివృద్ధితో ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్న కశ్మీర్‌లో ఆధ్యాత్మిక, సాధారణ పర్యాటకానికి దన్నుగా నిలబడుతున్నారు. ఇందూరు జిల్లా వాసులు సైతం కశ్మీర్ పర్యటకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి అమర్‌నాథ్ యాత్ర, కశ్మీర్ యాత్ర కోసం ఇప్పటి వరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నుంచి 124 మంది మెడికల్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇంకా మరికొందరు ఈ సర్టిఫికెట్లు తీసుకునే పనిలో ఉన్నారు. జిల్లా నుంచి పలువురు బృందాలుగా వెళుతున్నారు. మరోవైపు సిద్ధిపేటకు చెందిన అమర్‌నాథ్ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో యాత్ర మార్గంలో అన్నదానం చేస్తున్నారు. ఈ అమర్‌నాథ్ సేవాసమితిలో నిజామాబాద్ జిల్లా వాసులు సభ్యులుగా ఉన్నారు.
సైన్యం మీద అపారమైన నమ్మకంతో
కశ్మీర్ యాత్రకు జిల్లా వాసులు
మంచులింగాన్ని దర్శించుకున్న
యాత్రికులు
పహల్గామ్ ఘటనతో బెదిరేది
లేదంటున్న శివయ్య భక్తులు