
క్రైం కార్నర్
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
● భర్త మృతి, భార్యకు గాయాలు
బోధన్‌టౌన్(బోధన్): ఎడపల్లి మండలం దూపల్లి గేట్ సమీపంలోని బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇలా.. రెంజల్ మండలం బాగెపల్లి గ్రామానికి చెందిన దంపతులు వాద్యాల రాములు(54), ఇంద్ర కలిసి సోమవారం ద్విచక్ర వాహనం (టీవీఎస్ చాంప్)పై నిజామాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. దూపల్లి గేట్ వద్ద వారు రోడ్డు దాటుతుండగా బోధన్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న కారు వారిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో
భర్త వాద్యాల రాములు అక్కడికక్కడే మృతి చెందగా భార్య ఇంద్రకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి ఇంద్రను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దుబాయ్‌లో పెద్దవాల్గోట్ వాసి ..
సిరికొండ: మండలంలోని వాల్గోట్ గ్రామానికి చెందిన వడియాల రవీందర్ (38) ఈ నెల 4న గల్ఫ్ దేశమైన దుబాయిలో గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బతుకు దెరువు కోసం కొద్ది సంవత్సరాలుగా రవీందర్ దుబాయ్‌కి వెళ్తున్నాడు. సెలవుపై ఏడాది క్రితం ఇంటికి వచ్చి, వెళ్లాడు. రోజూలాగే డ్యూటీకి వెళ్లివచ్చి రూమ్‌కు విశ్రాంతి తీసుకుంటున్న రవీందర్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే తోటి స్నేహితులు హాస్పిటల్‌కు తరలించే లోపే మృతి చెందాడు. ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్