
ఊరి పేరులో భాగమైన రథాలు
మండల కేంద్రమైన రామారెడ్డిని పూర్వకాలం నుంచే రథాల రామారెడ్డిగా పిలిస్తున్నారు. దోమకొండ సంస్థనాధీశులు రామిరెడ్డి, గ్రామంలోని రామాలయం పేరుమీదుగా గ్రామానికి రామారెడ్డి అనే పేరు వచ్చింది.●
● రామారెడ్డి గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఒక రథం, రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఒక రథం పూర్వకాలం నుంచే ఉన్నాయి. అలాగే ఇసన్నపల్లి(రామారెడ్డి) కాళభైరవుడి ఆలయంలో ఒక రథం ఉంది.
● ఊర్లో ఇన్ని రథాలు ఉండటంతో గ్రామం పేరు రథాల రామారెడ్డిగా ఎన్నో ఏళ్ల నుంచి వాడుకలో ఉంది.
● ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు సీతారామచంద్రస్వామి, రాజరాజేశ్వర స్వామి వార్లకు రథోత్సవం నిర్వహిస్తారు.
● ప్రతి యేటా కార్తీక బహుళ పంచమి నుంచి కార్తీక బహుళ నవమి వరకు జరిగే కాలభైరవుడి జన్మదినోత్సవాల్లో స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు.
● సీతారామచంద్రస్వామి, రాజరాజేశ్వర స్వామి రథాలను 1992 వరకు కట్టెలతో తయారుచేసి, ఉత్సవాలు ముగిసిన తర్వాత విప్పి వేసేవారు.
● 1995లో గ్రామస్తులు ఇనుప రథాలను తయారు చేయించారు. – రామారెడ్డి
నిందితుల అరెస్టు.. నిబంధనలు
ఖలీల్‌వాడి: వివిధ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్) చట్టం ప్రకారం నడుచుకోవాలి. క్రిమినల్ కేసుల్లో మహిళలు, వృద్ధుల అరెస్ట్, విచారణ చేసేటప్పుడు చట్టాలకు లోబడి వ్యవహరించాలి.
● మూడేళ్ల జైలు శిక్ష ఉన్న నేరాల కింద నమోదైన కేసుల్లో 60ఏళ్లు పైబడిన వారు నిందితులుగా ఉంటే వారిని అరెస్ట్ చేయడానికి ఏసీపీ, పైస్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
● నేరాల్లో మహిళలు నిందితులైతే, వారిని సూర్యోదయం తర్వాత లేదా సూర్యాస్తమయం లోపు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.
● రాత్రివేళల్లో అయితే నిందితురాలు ఉన్న ప్రాంతంలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లేదా, కేసు నమోదు చేసిన ప్రాంతంలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి, వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిందితురాలి వెంట మహిళ పోలీసులను ఉంచాలి.
సమాచారం
మీకు తెలుసా?

ఊరి పేరులో భాగమైన రథాలు