
తాళం వేసిన మూడిళ్లలో చోరీ
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని న ర్సింగ్‌పల్లిలో తాళం వేసిఉన్న మూడిళ్లల్లో గుర్తుతెలి యని దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్ప డ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇ లా.. గ్రామంలోని గన్నారం మోహన్ తన ఇంటికి తాళం వేసి డాబాపైన కుటుంబ సభ్యులతో కలిసి ని ద్రించాడు. అర్ధరాత్రి వేళ దుండగుడు తాళం పగుల గొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. బెడ్‌రూంలోని బీరువా తాళం పగులగొట్టి అందులో ఉన్న 11 తులాల వర కు బంగారం, బంగారు నగలు, రూ.10వేల వరకు నగదును దోచుకెళ్లాడు. అనంతరం దుబ్బాక గంగామణి ఇంటి తాళాలు పగులగొట్టి రూ.25వేల నగదు ను ఎత్తుకెళ్లాడు. అదేవిధంగా అరుగు చిన్నయ్య ఇంటి తాళాలు ధ్వంసం చేసినప్పటికీ విలువైన వస్తువులు లేకపోవడంతో చోరీకి పాల్పడలేదు. ఆయా ఇ ళ్ల కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం లేచి చూ సేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గ మనించి, పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌టీం బృందం ఘటనాస్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై సుస్మిత కేసు నమోదు చేసుకున్నారు. కాగా దుండగుడు ఒక్కడే వచ్చి మూడిళ్లలో చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. మంకీ క్యాంప్, చేతులకు గ్లౌజులు ధరించి ఉన్నాడని, త్వరలోనే దొంగను పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.
సుమారు 11 తులాల బంగారం, రూ.35వేల నగదు అపహరణ