
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్‌వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నాలుగో టౌన్ పోలీసులు తెలిపారు. గత నెల 25న నగరంలోని బింగి ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో పడిఉండగా, పోలీసులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో గురువారం అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు షర్ట్, లుంగీ ధరించినట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసినచో నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గాని, 87126 59840, 87126 59719ను సంప్రదించాలన్నారు.
చికిత్సపొందుతూ ఒకరు..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన బైండ్ల అనిల్‌కుమార్(16) అనే బాలుడు కొంతకాలంగా కల్లుకు బానిసయ్యాడు. ఈక్రమంలో బుధవారం గ్రామశివారులోకి వెళ్లి గడ్డిమందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనమేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం అతడు మృతిచెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వో మనోహర్‌రావు తెలిపారు.