పనితీరు అంతంతే..
నిజామాబాద్‌అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల పనితీరులో ఉమ్మడి జిల్లా వెనకబడింది. కేంద్ర విద్యాశా ఖ పాఠశాలల పనితీరుపై ఇటీవల పర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(పీజీఐ) విడుదల చేసింది. బడుల్లో మౌలిక వసతుల కొరత, డిజిటల్ విద్యావిధానం లేకపోవడం, తరగతికి ఒక టీచర్‌ను నియమించకపోవడంతో అభ్యసన సామర్థ్యం తగ్గి గ్రేడింగ్‌లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు వెనుకబడ్డాయి.
కేంద్ర విద్యాశాఖ 2023–24 విద్యా సంవత్సరానికి అన్ని రాష్ట్రాల్లో విద్యాస్థితిగతులపై అధ్యయ నం చేసి పనితీరు నివేదికలను జిల్లాలవారీగా విడుదల చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ, యూ–డైస్, న్యాస్, ఎండీఎం ద్వారా వివరాలను సేకరించిన కేంద్ర విద్యాశాఖ వాటిని క్రోడీకరించి ఫలితాలను ప్రకటించింది. రాష్ట్రస్థాయిలో జిల్లాల వారీగా చూస్తే కామారెడ్డి జిల్లా 12వ, నిజామాబాద్ 18వ స్థానంలో నిలిచాయి.
పర్యవేక్షణ.. ప్రక్షాళన లేక..
పాఠశాల విద్యాశాఖలో ప్రతి విద్యార్థిని పాస్ చే యించి పై తరగతికి పంపించే క్రమంలో కాగితాలు మారుతున్నా.. విద్యార్థుల సూక్ష్మ ప్రగతిని ఉపాధ్యాయులు అంచనా వేయలేకపోతున్నారు. అలాగే ప్రా థమిక స్థాయిలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేకపోవడంతో ప్రా థమిక బడుల్లో విద్యార్థుల నమోదు క్రమంగా తగ్గుతోంది. చాలా పాఠశాలల్లో సరైన మరుగు దొడ్లు, మూత్రశాలలు, అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రా థమిక పాఠశాలల్లో కంప్యూటర్లు లేక విద్యార్థులకు డిజిటల్ విద్య అందడం లేదు. మధ్యాహ్న భోజన నిర్వహణలో వంట సిబ్బందికి ఇస్తున్న సొమ్ము సరిపోక విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఒక్క నిజామాబాద్ రూరల్ మండలంలో తప్ప అన్ని మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈవోలు ఉండడంతో పర్యవేక్షణ గాడితప్పింది.
పర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్ విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ
వెనకబడిన ఉమ్మడి జిల్లా
మౌలిక వసతుల కల్పన,
ఉపాధ్యాయుల నియామకంలో వెనుకంజ
మెరుగైన విద్య అందిస్తున్నాం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నాం. ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఫలితాలు రాని పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. మౌలిక సదుపాయాలు సైతం కల్పిస్తున్నాం. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి


