తుప్పు పడుతున్న వాహనాలు
బిచ్కుంద(జుక్కల్): వివిధ కేసులలో పోలీసులు పట్టుకున్న వాహనాలను బిచ్కుంద ఎకై ్సజ్, పొలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఏళ్లుగా కేసులు విచారణలో ఉండడంతో వాహనాలు అలాగే ఉండి పూర్తిగా చెడిపోతున్నాయి. నాటుసారా, గంజాయి, రోడ్డు ప్రమాదాలు, ఇతర సరుకుల అక్రమ రవాణా, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను, దొంగలు చోరీలకు పాల్పడి పట్టుబడ్డ వాహనాలను పొలీసులు సీజ్ చేస్తున్నారు. కేసుల విషయంలో కోర్డు వరకు పోవడం, తీర్పు వచ్చేవరకు సమయం పడుతుండటంతో వాహనాలు స్టేషన్ ఆవరణలో పాడవుతున్నాయి. వాహనాలపై అధికారుల నిఘా లేకపోవడంతో విడిభాగాలు మాయమవుతున్నాయి. దీంతో సంబంధిత వాహనదారులు వాటిని తీసుకెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాఉ. కొందరు తుప్పుపట్టిన వాహనాలను తీసుకెళ్లెందుకు ముందుకురావడం లేదు. ఈక్రమంలో అధికారులు పట్టుకున్న వాహనాలకు వేలం వేస్తే ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


