మంత్రి పదవి | - | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి

Jun 9 2025 12:52 AM | Updated on Jun 9 2025 12:52 AM

మంత్ర

మంత్రి పదవి

అప్పుడు.. ఇప్పుడు.. అంటూ మంత్రి వర్గ

విస్తరణపై ఊరించిన కాంగ్రెస్‌ అధిష్టానం చివరకు

ఉమ్మడి జిల్లాకు మొండిచేయి చూపింది. సీనియర్‌

అయిన బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డికి బెర్త్‌

ఖాయమని మొదటి నుంచి అంతా భావించినప్పటికీ

ఉమ్మడి జిల్లాలోని మిగతా ముగ్గురు కాంగ్రెస్‌

ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి కోసం తమ

వంతు ప్రయత్నాలు చేశారు. అయితే మొదటికే

మోసం అన్న చందంగా అసలు ఉమ్మడి

జిల్లాకు మంత్రి పద దక్కలేదు. ఓ వైపు

బీజేపీ బలపడుతుండగా.. మరో వైపు

అసలు జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడం

లేదని కాంగ్రెస్‌ శ్రేణులు అసహనం

వ్యక్తం చేస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ ఏడాదిన్నర తరువాత చేపట్టినప్పటికీ కేవలం ముగ్గురు మంత్రులతోనే సరిపెట్టడంతో జిల్లాకు మొండి‘చెయ్యి’ మిగిలింది. కేబినెట్‌లో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉండగా, కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని అంతా భావించినప్పటికీ చివరకు నిరాశే మిగిలింది. దీంతో 18 నెలల పాటు ఊరించి.. ఉసూరుమనిపించినట్లైందని కాంగ్రెస్‌ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 9 సీట్లకు గాను బీజేపీ మూడు చోట్ల, బీఆర్‌ఎస్‌ రెండు చోట్ల గెలిచాయి. కాంగ్రెస్‌ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సీనియర్‌ అయిన సుదర్శన్‌రెడ్డికే కేబినెట్‌ బెర్త్‌ ఖాయమని ప్రతిఒక్కరూ భావించారు. మలివిడతలో వస్తుందని భావించడంతో సుదర్శన్‌రెడ్డి అనధికారిక మంత్రిగానే వ్యవహరిస్తూ వచ్చారు. అధికార యంత్రాంగం సైతం ఆయనను మంత్రిగానే భావిస్తూ రావడం గమనార్హం. ఈ క్రమంలో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి గెలిచిన డాక్టర్‌ భూపతిరెడ్డి పేరు సైతం కేబినెట్‌ బెర్త్‌ కోసం పార్టీ హైకమాండ్‌ పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరోవైపు ఎల్లారెడ్డి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మదన్‌మోహన్‌ సైతం కేబినెట్‌ బెర్త్‌ కోసం ఢిల్లీలో తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. జుక్కల్‌ నుంచి గెలుపొందిన లక్ష్మీకాంతారావు సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన నలుగురు ఎమ్మెల్యేలు కెబినెట్‌ పదవి ఆశించినప్పటికీ ఎవ్వరికీ కేటాయించకపోవడంతో ఉమ్మడి జిల్లాకు నిరాశే మిగిలింది.

రెడ్డికి దక్కని అవకాశం!

కేబినెట్‌ బెర్త్‌ కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గట్టిగా ప్రయత్నించారు. తమకు మంత్రి పదవి కేటాయించకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. వీరిద్దరూ రెడ్డి కులానికి చెందినవారు కావడంతో ఆ ప్రభావం సుదర్శన్‌రెడ్డి మీద పడింది. ఈ నేపథ్యంలో రెడ్డి కులానికి చెందిన వారికి ఈ విడతలో కేబినెట్‌ బెర్త్‌ కేటాయించలేదు. సుదర్శన్‌రెడ్డి సైతం ఇదే వర్గానికి చెందినవారు కావడంతో రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి సెగ ఇక్కడ తగిలింది. ఫలితంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు మంత్రిపదవి దూరమైంది.

రంగారెడ్డి జిల్లాతో పాటు ఇందూరు జిల్లాకు మాత్రమే ప్రాతినిధ్యం కరువు

తాజా కేబినెట్‌ విస్తరణ తరువాత రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తర్వాత ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు మాత్రమే కేబినెట్‌లో బెర్త్‌ లేకుండాపోయింది. హైదరాబాద్‌ జిల్లా నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎవరూ ఎమ్మెల్యేలుగా గెలవలేదు. ఉమ్మడి నిజామాబాద్‌లో మాత్రం నలుగు రు గెలిచారు. మంత్రి పదవి కేటాయించకపోవ డంతో ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసినప్పటికీ, ఖర్చు పెట్టి పార్టీని పోషించినప్పటికీ అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వంలో జిల్లాకు స్థానం కల్పించకపోవడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. పార్టీ అధినాయకత్వం తీరుపై భగ్గుమంటున్నారు. కాగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి.. సుదర్శన్‌రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు.

బీజేపీకి మరింత బలమిచ్చినట్లేనా..

ఉత్తర తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బలోపేతమవుతోందని, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆ పార్టీ మరింత శక్తిమంతంగా ఉందని.. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి కేటాయించకపోవడం బీజేపీకి బలాన్నిచ్చినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అర్వింద్‌ ఎంపీగా వరుసగా రెండుసార్లు గెలుపొందడంతోపాటు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ తరుఫున గెలుపొందారు. కామారెడ్డి నుంచి అయితే వెంకటరమణారెడ్డి ఏకంగా రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లను ఓడించి శాసనసభలో అడుగుపెట్టడం గమనార్హం. బీజేపీ రోజురోజుకూ బలపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీని దీటుగా ఎదుర్కోవాల్సి ఉండగా.. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు మంత్రి పదవి కేటాయించలేదని కాంగ్రెస్‌ శ్రేణులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

కేబినెట్‌ బెర్త్‌ కేటాయింపులో

జిల్లాకు మొండి‘చెయ్యి’

సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి

ఇవ్వకపోవడంతో శ్రేణుల గుర్రు

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాకు తాకిన సెగ

మంత్రి లేని జిల్లాగా మిగిలిన

ఉమ్మడి నిజామాబాద్‌!

అభివృద్ధి కుంటుపడుతుంది.. పార్టీకి నష్టం కలుగుతుంది

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కు మంత్రి పదవి లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. జి ల్లాలో వివిధ ప్రాజెక్టులకు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు రావాలంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం తప్పనిసరి. నీటిపారుదల, బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ తదితర ప్రాజెక్టులు పట్టాలెక్కాలంటే కేబినెట్‌ పదవి కచ్చితంగా అవసరం. పాలసీ మేకింగ్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రాతిని థ్యం తప్పనిసరి. మంత్రి లేకపోవడంతో జిల్లాకు అ న్యాయం జరగడంతో పాటు పార్టీకి సైతం నష్టం క లుగుతుంది. జిల్లా నుంచి ప్రభుత్వంలో భాగస్వా మ్యం ఉంటేనే జిల్లా అభివృద్ధితో పాటు పార్టీ బలో పేతం అవుతుంది. పార్టీ నాయకత్వం ఈ అంశాల ను పరిగణలోకి తీసుకోవాలి. – డాక్టర్‌ భూపతిరెడ్డి,

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే

మంత్రి పదవి1
1/1

మంత్రి పదవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement