వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌

Jun 2 2025 1:19 AM | Updated on Jun 2 2025 1:19 AM

వంద ర

వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌

గున్కుల్‌ శివారులో వరి విత్తనాలు చల్లుతున్న రైతులు

బాన్సువాడ : మున్సిపాలిటీల్లో 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సోమవారం నుంచి యాక్షన్‌ ప్లాన్‌ ప్రారంభించాలని మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం నుంచి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించడం, నర్సరీల్లో ఉన్న మొక్కల వివరాలు, ఎక్కడ పంపిణీ చేయాలి. ఎక్కడ నాటాలి అనే వివరాలు నమోదు చేశారు. అదే విధంగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం, చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేయడం లాంటివి చేయనున్నారు. వార్డుల్లో వార్డు ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఆస్తి పన్ను తప్పుఒప్పులను సవరించడం లాంటి కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

అక్రమ నల్లా కనెక్షన్ల గుర్తింపు..

కొత్తగా ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లు..

మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులను గుర్తించడం, వారికి రుణాలు ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడంలాంటివి చేపట్టాలి. వీటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన సంఘాలకు రుణాలు ఇప్పించడం, కొత్తగా ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ల ఏర్పాటు దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బల్దియాల్లో ప్రణాళిక

రూపొందించిన అధికారులు

అభివృద్ధి పనుల పూర్తి, రుణాలు

ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాల

ఏర్పాటు లక్ష్యం

నేటి నుంచి ప్రారంభం

నివేదిక సిద్ధం చేశాం

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్‌ 2 నుంచి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని విభాగాల ఉద్యోగులు చేయాల్సిన పనులు గుర్తించి వాటిని పూర్తి చేస్తారు. ఇందుకు సంబంధించి అన్ని వివరాలతో నివేదిక సిద్ధం చేశాం.

– శ్రీహరి రాజు, మున్సిపల్‌ కమిషనర్‌, బాన్సువాడ

ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు పూర్తి చేయడంతో పాటు వార్డుల్లో అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించడం, క్రమబద్ధీకరించడం, లేదా తొలగించడం లాంటివి చేపట్టాల్సి ఉంటుంది. మున్సిపల్‌ అధికారులు ఆస్పత్రుల యాజమాన్యాల సహకారంతో కార్మికులకు వైద్య శిబిరాలు చేపట్టాలి. పార్కుల్లో అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. పారిశుధ్యం మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను ఆయా మున్సిపాలిటీలు తేదీల వారీగా జాబితా రూపొందించే పనిలో పడ్డారు.

వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌1
1/1

వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement