
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
దోమకొండ: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ సూచించారు. ఆదివారం ఆయన అంచనూరు, లింగుపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వర్షం కురిసినా ఇబ్బందులు రాకుండా కుప్పల చుట్టూ కాలువలు ఏర్పాటు చేయాలని, టార్పాలిన్‌లతో కప్పి ఉంచాలని సూచించారు. ఐకేసీ ఏపీఎంతో పాటు సిబ్బందికి ఆయన సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి రమేశ్ బాబు, ఐకేపీ ఏపీఏం రాజు, సీసీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.